మంత్రి డా. నిమ్మల కు పోలీసుల గౌరవ వందనం
పాలకొల్లు జూన్ 13 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం లో చోటు దక్కిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేసి పాలకొల్లు వచ్చిన సందర్భంగా ఆయన నివాసం వద్ద గురువారం పోలీసులు గౌరవ వందనం చేసారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ బాధ్యత యుతంగా విధులు నిర్వహించాలని ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.