*వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుంటే విద్యాసంస్థల గుర్తింపు రద్దు*
ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ దృష్టి సారిస్తున్నారు.
ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి ఏటా మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఈసారి ధ్రువపత్రం అందని వాహనాలతో పాటు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు. బస్సులకు తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. బస్సులు ఇంకా ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొంద కుండా తిప్పితే శిక్షార్హులు. ఒకవేళ పొందితే ఫిట్నెస్ సర్టిఫికెట్ చూపించాలి.