ఉద్యోగ కార్మికులతో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
గణపవరం సి పి ఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగ కార్మికులు తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం (సరిపల్లె) గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యలు మేతల తయారీ పరిశ్రమ థాయిలాండ్ దేశానికి చెందిన కంపెనీలో పని చేసే ఉద్యోగులు కార్మికులు ఐదో రోజు గణపవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన మంగళవారం తెలిపారు. తహసిల్దార్ వై రాంబాబు కి కార్మికులు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు గణపవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు మాట్లాడుతూ సిపి ఎఫ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో మూసివేయడం తగదని ఆయన అన్నారు. అధికారులు రాబోయే ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిచి ఉద్యోగ కల్పన కల్పించి ఉపాధి అవకాశాలను పెంచాలని ఆయన అన్నారు. రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి గోవింద్ దండు రామలింగరాజు ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నార