భవిత సేవలు దివ్యాంగుల పిల్లల సద్వినియోగం చేసుకోండి
APC పి శ్యాంసుందర్
పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రత్యేక ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ సర్వే నిర్వహించి 596 మంది దివ్యాంగుల పిల్లలను గుర్తించారని పాఠశాల పునః ప్రారంభం అవగానే పిల్లలందరి పేర్లు పాఠశాలలో నమోదు చేయించి అవసరమైన వారికి భవిత కేంద్రంలో ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఉచిత ఉపకారణాలు, బోధన సామాగ్రి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, ఎస్కార్ట్ అలవెన్స్లు, రీడర్ అలవెన్స్, గర్ల్స్ స్టైఫండ్,హోమ్ బేస్డ్ స్టైఫండ్, అందచేయపడతాయని ఉపకరణాల నిర్ధారణ శిబిరంలో డాక్టర్లు నిర్ధారించిన దివ్యాంగుల పిల్లలకు త్వరలో ఉపకరణాలు అందజేయబోతున్నామని దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు భవిత కేంద్రంలో పిల్లలకు అందించే సేవలు సద్వినియోగం చేసుకొని పిల్లలను చదివించాలని తెలిపారు సహిత విద్య సమన్వయకర్త సిహెచ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 21 రకాల వైకల్యం లోపం గల పిల్లల గుర్తించు కరపత్రాలు అందజేసి అంగన్వాడి టీచర్స్ కు ANM లకు, ఆశ వర్కర్లకు, గ్రామ సచివాలయం సిబ్బందికి, ప్రత్యేక ఉపాధ్యాయులు అవగాహన కల్పించారని దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించిఅందరూ పిల్లలలో మనోధైర్యాన్ని కల్పిస్తూ చదివించినట్లయితే వారు ఇతరమైన అతర పడకుండా జీవించగలుగుతారని తెలిపారు, సహిత విద్య సహాయ సమన్వయకర్త, టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల పిల్లలకు పరీక్షల్లోనూ, ఉద్యోగాలను రాయితీలు కల్పించిందని దివ్యాంగుల పిల్ల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

previous post