March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి జిల్లాలో 29 ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పండగ వాతావరణంలో ముఖ్య కూడళ్లలో, కార్యాలయాల్లో లైటింగ్ ఏర్పాట్లు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి జిల్లాలో 29 ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పండగ వాతావరణంలో ముఖ్య కూడళ్లలో, కార్యాలయాల్లో లైటింగ్ ఏర్పాట్లు

కలెక్టర్ మాధవీలత

జూన్ 12 వ తేది బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం పరిధిలోని కేసరపల్లి గ్రామంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి, ముఖ్య కూడళ్లలో కార్యాలయాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు.

సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర స్థాయి అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చెయ్యడం జరుగుతున్నట్లు, ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు, వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యడం జరుగుతున్నట్లు తెలియ చేశారు. ఇందు కోసం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో 9 చోట్ల, మండల కేంద్రంలో, పురపాలక సంఘం పరిధిలో స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి విస్తృత స్థాయిలో జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో, మున్సిపల్  మండల హెడ్ క్వార్టర్స్ లో తగిన స్క్రీన్స్ ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ మాధవీ లత తెలియ చేశారు. (జత పరచడమైనది)

రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ పరిధిలో అనువైన కళ్యాణ మండపం గుర్తించి అక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఇందు కోసం స్థానిక ప్రజా ప్రతినిధులతో క్షేత్ర స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

దేదీప్యమానంగా లైటింగ్ ఏర్పాట్లు

కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీసు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, నగరంలోని ముఖ్య కూడళ్లలో తగిన లైటింగ్ ఏర్పాటు చెయ్యాలని మాధవీలత తెలియ చేశారు. l

Related posts

8,9 తేదీల్లో వాడపల్లి రూట్లో ట్రాఫిక్ మళ్లింపు

AR TELUGU NEWS

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించిన గండేపల్లి మండల ఫోటోగ్రఫీ యూనియన్

AR TELUGU NEWS

పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో రఘు రామకృష్ణం రాజు కు అభినందనలు

AR TELUGU NEWS