March 14, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మూలన పడ్డ నాణ్యత ప్రమాణాలు పట్టించుకోని అధికారులు!

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

మూలన పడ్డ నాణ్యత ప్రమాణాలు పట్టించుకోని అధికారులు!

నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ సెంటర్ నిర్వాహకులు

రోగాల పాలవుతున్న వినియోగదారులు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు సెంటర్లు, బిర్యానీ సెంటర్లు ఈమధ్య ఎక్కువయ్యాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టానుసారం హోటల్స్ నిర్వాహకులు టిఫిన్లు, బిర్యానీలు తయారుచేసి అమ్ముతున్నారు. కల్తీ నూనెలు, రంగులు, కెమికల్స్ వేసి బిర్యానీ తయారు చేస్తున్నారు. అలాగే మటన్ బిర్యానీ కి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఉన్న కబేలా నుంచి తీసుకువచ్చిన మాంసాన్ని కాకుండా ఇతరత్రా ద్వారా సేకరించిన వాటితో బిర్యాని వండుతున్నారు. అలాగే కొన్ని రోజులపాటు ఫ్రిజ్ లలో నిలవ ఉంచిన మాంసాన్ని సైతం వాడుతున్నారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను తిన్న ప్రజలకు అనేక ఉదర సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు లేదా ఫ్యాక్టరీల్లో వర్క్ చేసేందుకు వెళ్లడం తదితర కారణాల రీత్యా ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకునే తీరిక చాలామందికి ఉండడం లేదు. ఇలాంటి వాళ్లు బయట ఫుడ్ సెంటర్ లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న హోటళ్ల నిర్వాహకులు ప్రభుత్వ ప్రమాణాలు పాటించకుండా బిర్యానీలు, టిఫిన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. టిఫిన్ సెంటర్లలో పూరీలు బజ్జీలు వేసే ఆయిల్ ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. కానీ హోటల్స్ నిర్వాహకులు ఆయిల్స్ మార్చకుండా పదేపదే వాడడంతో హానికర రసాయనాలు అందులో ఏర్పడతాయని సైంటిస్టులు, డాక్టర్లు చెబుతూ వస్తున్నారు.అలాగే టిఫిన్స్ తయారు చేసే మాస్టర్స్ సైతం కనీస శుభ్రత పాటించకుండా వాటిని తయారుచేస్తున్నారు. అయినా సరే ప్రజలు రుచినే చూస్తున్నారు గాని ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. కెమికల్స్ కలిసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే చాలామంది యువకులు గ్యాస్ ట్రబుల్స్ పేగు సంబంధిత క్యాన్సర్లకు గురవుతున్నారు. ఇదంతా తెలిసిన హోటల్ నిర్వాహకులు మాత్రం శానిటేషన్, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, పంచాయతీ,వెటర్నరీ అధికారులు గాని హోటల్స్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హోటల్స్ లో తనిఖీలు చేసి నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related posts

కౌంటింగ్ ముందు తర్వాత గట్టి బందోబస్తు.. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ..

AR TELUGU NEWS

టిడ్కో ఇళ్లని అర్హులకు త్వరితగతిని అప్పగించాలి

AR TELUGU NEWS

పోస్టల్ బ్యాలెట్, ఈ,టి,పి,బి ఎస్ పొరపాట్లకు తావులేని విధంగాఓట్ల లెక్కింపును పూర్తి చేయాలి.. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్

AR TELUGU NEWS