మల్కిపురం ఎస్సై ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు
రాజోలు జూన్ 10 : మల్కిపురం మండలం విశ్వేశ్వరపురంలో అంబేద్కర్ విగ్రహానికి మలికిపురం ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సోమవారం ఏర్పాటు చేశారు.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఎర్ర పోతవరం లాకులు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి అవమానం కలిగించారు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంబేద్కర్ విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్సై స్థానిక సంఘాలకు తెలిపారు. దీంతో విశ్వేశ్వరపురం ఎస్సీ సంక్షేమ సంఘం, జై భీమ్ అభ్యుదయ యువజన సంఘం కలిసి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సంఘాల అధ్యక్షులు చవ్వాకుల సుందర్రావు,బోస్ నరేష్,కార్యదర్శులు కారుపల్లి శ్రీనివాస్,పిల్లి నిఖిల్, కోశాధికారి పెదపాటి ఇశ్రాయేలు,గెడ్డం సింహ,నల్లి గంగా చలం,వడ్లమూడి రామస్వామి,ములపర్తి సన్నీ పాల్, కారుపల్లి రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.
