మెగాస్టార్ ని కలిసిన చాగంటి చిన్న, అంకిత భావంతో పనిచేస్తే భవిష్యత్ ఉంటోంది – చిరంజీవి
నర్సాపురం జూన్ 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు భారత పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఘన విజయం సాధించడంతో జనసేన అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవిని జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ( చిన్న) మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చాగంటి మురళీకృష్ణ చిన్న మాట్లాడుతూ చిరంజీవి వే తమకు పెద్ద దిక్కు అని అందుకే ఆయనను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. చాగంటి మురళీకృష్ణ (చిన్న) చిరంజీవిని కలిసిన సందర్భంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన చాగంటి మురళీకృష్ణ ( చిన్నా) ను చిరంజీవి అభినందించినట్టుగా తెలిసింది. అలాగే కష్టపడి పనిచేయమని రాజకీయ రంగంలో తప్పకుండా చిన్నకు మంచి భవిష్యత్తు ఉంటుందని చిరంజీవి
సూచించినట్టు తెలిసింది