లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకనారాలు.
కాకినాడ జూన్ 10 హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు,ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ పలు దేవాలయాలలో బాలకృష్ణ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బాలల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో పులి పద్మకుమారి, రవి వర్మ, భవాని, ప్రశాంత్ చౌదరి, కామేష్ పైలా శ్రీనివాసరావు పైలా సాగర్ కిరణ్ అడపా జగదీష్ ఉప్పు మురళీకృష్ణ మండపాక నాగబాబు అంగాని శేషగిరి వర్మ అడపా గోపి మరియు ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పేదలకు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 742వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరఫున బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ అటు సినీరంగంలో ఇటు రాజకీయాలలో రాణిస్తున్నారన్నారు.హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
