కేంద్ర మంత్రులను శ్రీనివాస్ వర్మ,రామ్మోహన్ నాయుడు లకు అభినందనలు అభినందనలు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నర్సాపురం జూన్ 10 కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ను, శ్రీకాకుళం ఎంపీ
కింజరాపు రామ్మోహన్ నాయుడును మరియు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు లను సోమవారం ఢిల్లీలో నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆయన సోదరుడు బొమ్మిడి సునీల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గ పరిధిలో ఇంతవరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, సత్వరమే ప్రగతి ప్రణాళిక రూపొందించి దృష్టి సారించే దిశగా నూతన కేంద్ర మంత్రి వరించిన శ్రీనివాస్ వర్మ ను కోరినట్లు తెలిపారు.