- స్టాంపులు అమ్మిన సొమ్ము లక్షల్లో స్వాహా…
- రేణిగుంట సబ్ రిజిస్టర్ శోభారాణి సస్పెండ్.
- రేణిగుంట సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో భారీ స్కామ్!
రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అడిగే వారు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షలాది రూపాయల సొమ్ము వ్యక్తిగతంగా దోపిడీ చేశారు. వైయస్సార్ గవర్నమెంట్ లో ఇంతకాలం సకల శాఖ మంత్రిగా చలామణి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో అధికారులు అక్రమాలకు విచ్చలవిడిగా పాల్పడ్డారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపులు అమ్మిన సొమ్ము లక్షల్లో స్వాహా చేశారు. ఇన్ని రోజులు సజ్జల రామకృష్ణ రెడ్డి అండతో రెచ్చిపోయిన సబ్ రిజిష్ట్రార్ శోభారాణి ఇప్పుడు దిగ మింగేసిన సొమ్మును ఎలా రికవరీ చేయాలో అర్థం కాక తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు. అసలు కానుక రాలైన సబ్ రిజిస్టర్ శోభారాణిని ఎట్టకేలకు శనివారం రాత్రి విధుల నుండి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు విషయంలోకి వెళితే…
కొద్ది నెలలుగా సాగుతున్న ఈ తంతు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు వైసిపి అనుకూల ఉన్నతాధికారులు విషయాన్ని చిన్న పాటి విచారణతో ముగించడానికి కోటి రూపాయలు డీల్ కుదిరినట్టు సమాచారం అందుతోంది. నామ మాత్రపు విచారణ తో సరిపెట్టడానికి సన్నాహకాలు చేస్తున్నారు. సందట్లో సడేేమియా అంటూ తమకు కమిషన్ల కోసం రంగంలోకి దిగిన వైకాపా అనుకూల అధికారులు. ఈ క్రమంలో
వెలుగులోకి వస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కమిషన్ల కోసం కక్కుర్తి పడి వివాదాస్పద గా ఉన్న సర్వే నెంబర్ల పేరుతో
వందల సంఖ్యలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ లు జరిగినట్టు గుర్తించారు. మరోవైపు 2 ఏళ్లకు పైగా ప్రతిరోజు విక్రయించిన స్టాంపుల నిధులు ఏ రోజు కా రోజు వారి కార్యాలయ నగదు బ్యాంకు లో జమ చేయకుండా ఇంతకాలం ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సిన డబ్బులు ఇప్పటివరకు జమచేయని వైనం బయటపడింది. ఇందుకు పూర్తి సహకారం అందించి కుంభకణం లో భాగస్వామ్యం వ్యవహరించినట్లు సబ్ రిజిష్ట్రార్ శోభారాణి… జూనియర్ అసిస్టెంట్ షా బుద్దిన్ లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో జమ చేయాల్సిన నగదు తమ స్వంతానికి వాడుకున్న సబ్ రిజిష్ట్రార్.. సిబ్బంది ఏ మేరకు నిధులు నొక్కేసారని విషయంగా బయట పెట్టడం లేదు. కొంతకాలం క్రితమే ఈ అంశం వేలు పలికి వచ్చినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పి విచారణ అధికారులను కూడా మభ్యపెట్టినట్లుగా సమాచారం అందింది. సజ్జల పేరు చెప్పి అడ్డగోలుగా దోచేసిన సొమ్ము తో పై అధికారుల కు ఎర వేస్తున్నట్లుగా తెలిసింది. ఈ అక్రమాలు అవినీతిపై సి ఐ డి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. తప్పు చేసిన అధికారులను రక్షించే పనిలో నిమగ్నమైన జిల్లా రిజిష్ట్రార్.. డి ఐ జి రహస్య ప్రాంతంలో..మంతనాలు జరిపారు.గతంలో ఇలాంటి వివాదాలతోనే అప్పటి సబ్ రిజిష్ట్రార్ ఆనందరెడ్డి పై వేటుపడిన విషయం విదితమే. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కులను చూసుకొని అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.