ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణ మైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బంది కరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ..పొత్త పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్దం అవుతోంది.
Election 2024
Lok Sabha Results
Andhra Pradesh Results
Odisha Results
Election News
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మద్యం పాత బ్రాండ్ల అమ్మకాలు షురూ..!!
By Chaitanya
Published: Sunday, June 9, 2024, 14:49 [IST]
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణ మైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బంది కరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ..పొత్త పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్దం అవుతోంది.
ADVERTISEMENT
లోక్సభ ఎన్నికలు 2024
యోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల ఫలితాలు
మద్యం అమ్మకాల్లో మార్పులు
లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఏపీలో కొత్త ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రస్తుత లిక్కర్ పాలసీ రద్దు దిశగా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత లిక్కర్ పాలసీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మందుబాబుల్లో ఆగ్రహం ఉంది. గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందు బాబులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఊరూపేరూ లేని బ్రాండ్లు తెచ్చారంటూ అప్పటి విపక్షనేత చంద్రబాబు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు.