శ్రీ రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
భారతీయ వ్యాపారవేత్త మీడియా వ్యవస్థాపకుడు మరియు చలనచిత్ర నిర్మాత, రామోజీ గ్రూప్ అధిపతి, ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ రామోజీ పిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ ఛానల్ లు, చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఇలా ఎన్నో ప్రజారంజక సమాజానికి ఉపయోగపడే వాటిని సృష్టించిన గౌరవ శ్రీ రామోజీ రావు గారు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు.
రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటని అతని చేసిన సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా మిగిలిపోతాయని అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.