టిడ్కో ఇళ్లని అర్హులకు త్వరితగతిని అప్పగించాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలిచిన టిడ్కో ఇళ్లను అర్హులైన వారికి త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసం వద్ద టిడ్కో ఇంజనీర్లతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ ఇళ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పన, పూర్తికాని గృహ సముదాయాలపై ఆయన ఆరా తీశారు. అర్హులైన వారందరికీ పూర్తయిన ఇళ్లను త్వరితగతిన ఇవ్వాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*వర్షాకాలం ఇబ్బంది రానివ్వదు*
ఎర్ర కాలువ కింద ఉన్న నందమూరి అక్విడేట్ వద్ద పెరిగిపోయిన ఇసుక మేటలను వెంటనే తీయించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రాబోయేది వర్షాకాలం కావడంతో ఎగువ నుంచి వచ్చే వరద నీరు కిందకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని నిధుల విషయంపై తాను కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు మొదలు పెట్టించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలిగిన సహించేది లేదని స్పష్టం చేశారు.