ఉయ్యూరు – జూన్ 6 :
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాబు రాజేంద్రప్రసాద్.
ఉండవల్లి లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో లోకేష్ బాబు గారిని కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరియు మంగళగిరి నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాజేంద్రప్రసాద్.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…
ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ జూన్ 4వ తారీకు తో వదిలిపోయిందని, రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించుకొని, రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలికారని, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా చేస్తారని రాజేంద్రప్రసాద్ అన్నారు.