అవార్డు అందుకున్న తణుకు ఎస్ఈబీ సీఐ శ్రీనివాస్
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా తణుకు ఎస్ఈబీ సీఐ మద్దాల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం మంగళగిరి ఎస్ఈబీ బ్యూరో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రవిప్రకాష్ చేతులమీదుగా ట్రోఫీ, నగదు రివార్డు అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలు అందించడంతో పాటు కోర్టు నిర్వహణలో సేవలు అందించినందుకు గాను అవార్డు అందుకున్నారు.