టీడీపీ నేత పెండ్ర రమేష్ కు సత్కారం అమలాపురం, జూన్ 6′: టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం పట్ల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంబీసీ కన్వీనర్ పెండ్ర రమేష్ ను గురువారం రాష్ట్ర ఎంబీసీ డైరెక్టర్ యడ్లపల్లి తుక్కియ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన రమేష్ కు అభినందనలు తెలిపారు. జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో యడ్లపల్లి నరేష్ ధనకొండ శ్రీను ధనకొండ చిన్న బత్తుల దుర్గాప్రసాద్ గంగుల అన్నవరం బత్తుల పేరయ్య పెండ్ర ప్రభు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

previous post