కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం జూన్ 06 :సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిశారు. భీమవరం అభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని, మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని, ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని అన్నారు. భీమవరంలో వ్యవసాయానికి కావలసిన సాగు నీరు, త్రాగునీరు, వైద్యం తదితర విషయాలపై మాట్లాడారు. భీమవరం అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యను కూడా కలిశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.