March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఏలూరు జిల్లా

భర్త ముందే ప్రియుడుతో సంసారం!

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లాలి పేరు సుమలత. పచ్చని సంసారాన్ని తన చేతులతో తానే బుగ్గిపాలు చేసుకుంది. పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు ద్రోహం చేసిన మహిళ ఆమె. సినిమా స్టోరీలను అల్లడంలో ఎక్స్ పర్ట్. చివరకు ఆమె అల్లినది కట్టుకథ అని తెలిసి.. గుడ్లు తేలేశారు అత్తింటి వారు. ఇప్పటి వరకు అమాయకురాలు అనుకున్నారు.. కానీ ఆ తర్వాతే వారికి మబ్బులు వీడాయి. చివరకు ఇంతకు తెగించడంపై నోరెళ్లబెట్టారు అత్తా, మామలు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చి ఓ నాటకం ఆడింది సుమలత. కానీ ఆమెను సెల్ ఫోన్ పట్టించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రియుడి సహకారంతో భర్తను చంపి.. ఆత్మహత్య నాటకం ఆడింది సుమలత. ఆ వీడియోలను సెల్ ఫోనులో బంధించి.. వాటిని అపురూపంగా దాచుకుంది. కానీ చివరకు ఆ వీడియోలను సుమలత దొరికేలా చేశాయి. భర్తను చంపి బలవన్మరణంగా చిత్రీకరించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన చెట్టుమాల ఆశీర్వాదం (34) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి అందమైన భార్య ఉంది. ఆమె పేరే సుమలత. ఆమె దారి తప్పింది. గత కొంతకాలంగా నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు సూచాయగా తెలిసింది. అతడు అడ్డు తొలగించుకోవాలనుకుంది సుమలత. ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి భర్త నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి అతడి మెడకు వైరు బిగించి హత్య చేసింది.

ఆ తర్వాత ఏమీ ఎరుగన్నట్లుగా.. అత్తమామలను నిద్రలేపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. తనకు అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆమె మాటలు నిజమని నమ్మిన అత్తామామలు.. పోలీసులను ఆశ్రయించకుండా.. అతడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఇటీవల సుమలత.. భర్తను చంపుతుండగా తీసిని కొన్ని వీడియోలు ఆమె మొబైల్‌లో ఉన్నట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. ఆమెను ఈ విషయంపై నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తను హతమార్చినట్లు అంగీకరించింది. గురువారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిర్వహించారు. సుమలతను అరెస్టు చేసి ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Related posts

T.నర్సాపురం  PHC సంఘటన పై సమగ్ర విచారణ చేయండి. డియం & హెచ్ఓ తో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

AR TELUGU NEWS

డీపీఓ ఆకస్మిక తనిఖీ మొబైల్ కూల్ డ్రింక్ వ్యానుకు తాళాలు

AR TELUGU NEWS

అంగన్వాడి టీచర్ ఎమ్మెల్యే ఎలా అయ్యారు…?

AR TELUGU NEWS