March 13, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా బొలిశెట్టి..

• 61,510 ఓట్ల మెజార్టీతో ఆల్ టైం రికార్డ్..

తాడేపల్లిగూడెం, జూన్ 4,  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ

నియోజకవర్గం నుంచి కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పై 61,510 ఓట్లు భారీ మెజారిటీతో బొలిశెట్టి విజయదుందుభి మ్రోగించారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే ఇంతవరకు ఎవరు సాధించని అత్యధిక భారీ మెజార్టీని సాధించి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 61,510 ఓట్లు భారీ మెజారిటీతో ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. మొత్తం 15 రౌండ్ల లో జరిగిన ఓట్లు లెక్కింపులో

జనసేన అభ్యర్థి బొలిశెట్టికి 1,14,955 ఓట్లు రాగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొట్టుకు కేవలం 53,445 ఓట్లు మాత్రమే లభించాయి. పోలైన ఓట్లలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి 65.32 శాతం ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి

కొట్టు కేవలం 30.37 శాతం ఓట్లు మాత్రమే. దక్కించుకోగలిగారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మార్చీడి బాల్టికి 1868 ఓట్లు రాగా జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పి ఎస్ ఆర్ కృష్ణకు 913 ఓట్లు. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి బూసనబోయిన ఆంజనేయులుకు 502 ఓట్లు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీసువాసరావుకు 749 ఓట్లు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మరపట్ల రాజుకు 739 ఓట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మేకా వెంకటేశ్వరరావుకు 201 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఉంగరాల పద్మకు 253 ఓట్లు, నడపన అచ్యుత కుమార్ కు 157 ఓట్లు, బి. రాజేష్ కు 263 ఓట్లు లంకా ప్రసాద్ కు 183 ఓట్లు, సిరివరపు సింహాచలానికి 238 ఓట్లు రాగా నోటాకు 1522 ఓట్లు పడ్డాయి.

Related posts

నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

AR TELUGU NEWS

పురుషులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు.

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెం పుల్లయ్య గూడెం జనసేన కార్యకర్తల పరామర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

AR TELUGU NEWS