శాంతి భద్రతలు కాపాడుకోవడం నైతిక బాధ్యత.. సిఐ శ్రీనివాస్
భీమవరం జూన్ 03: శాంతి భద్రతలు కాపాడుకోవడం ఒక నైతిక బాధ్యత అని, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేయుతనందివ్వాలని, ఎన్నికల కోడ్ లో శిక్షలు కఠినంగా ఉంటాయని రెండో పట్టణ పోలీసు స్టేషన్ సిఐ జి శ్రీనివాస్ అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో శాంతి భద్రతలపై ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడుకోవడమంటే మనకు మనం రక్షించుకోవడమేనని, జూన్ 4న మన ప్రాంతంలో రెండు చోట్ల కౌంటింగ్ జరుగుతుందని, ఆ ప్రాంతాల్లో 144 సేక్షన్ అమల్లో ఉందని, శాంతి సామరస్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కౌంటింగ్ రోజున పోలీసులు ఎన్నికల అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరి శెట్టి కృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు బాబాజీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.