వ్యాపారులంతా పోలీసులకుసహకరించాలి
డిఎస్పీ మహేశ్వర రావు.
రాజోలు జూన్ 3: ఎన్నికల ఫలితాలు
మంగళవారం వెల్లడిస్తారు కాబట్టి కౌంటింగ్ దృష్ట్యా వ్యాపారులు తమకు పూర్తిగా సహకరించాలని అమలాపురం డిఎస్పి ఎం మహేశ్వరరావు కోరారు.అమలాపురం పట్టణంలో మంగళవారం కావడంతో దాదాపు 90 శాతం షాపులు ముసివేస్తారని,శాంతి భద్రతల దృష్ట్యా మిగిలిన షాప్ యజమానులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాపీ హోటల్స్,భోజనం హోటల్స్ పనిచేస్తాయని సాయంత్రం పూర్తిగా
మూసివేయాలని డిఎస్పీ తెలిపారు.పట్టణం అంతా పోలీస్ గుప్పిట్లో ఉంటుందని,చిన్న సంఘటన జరిగినా చర్యలు కఠినం ఉంటాయన్నారు.ముందు జాగ్రత్త కోసం తప్ప వ్యాపారులను,ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదన్నారు.రెండు ఛాంబర్లు తమకు పూర్తిగా సహకరించాలని డీఎస్పీ కోరారు.
