ప్రైవేట్ విద్యాసంస్థల్లో
విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
–కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ ప.గో.జిల్లా ఇంచార్జ్ నల్లి నాగరాజ్ డిమాండ్.
మొగల్తూరు జూన్ 3. పశ్చిమ గోదావరి జిల్లాలోనీ అన్ని మండలాల్లో విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ జిల్లా ఇన్చార్జి నల్లి నాగరాజు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లి నాగరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 ను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పుస్తకాలు యూనిఫామ్ లు వారు చెప్పిన దుకాణాలలోనే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రుల పై ఒత్తిడి తేవడం సరైనది కాదని అన్నారు. ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లను నిరుపేదలకు ఉచితంగా కేటాయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్ విద్య సంస్థలు ఏ మాత్రం పట్టించుకోకుండా విద్య హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా మేము విద్య హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాం అబద్ధాలు చెప్పడం సిగ్గు చేటు అని ప్రవేట్ విద్యా సంస్థల తీరుపై ఆయన మండి పడ్డారు.
విద్యార్థుల సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న విద్య సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తమతో కలిసి వచ్చే ప్రజాసంఘాల నాయకులతో కలిసి పోరాడటానికి సిద్ధంగా వున్నాము అని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ ప.గో.జిల్లా ఇన్చార్జి నల్లి నాగరాజు అధికారులను హెచ్చరించారు.