March 14, 2025
Artelugunews.in | Telugu News App
కోనసీమ జిల్లా

కౌంటింగ్ ఏజెంట్లు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

కౌంటింగ్ ఏజెంట్లు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా
రాజోలు మే 31 : జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరగడానికి సత్ప్రవర్తనతో తమ వంతు పాత్ర పోషించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా అన్నారు.ఎన్నికల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా స‌రైన ప్ర‌ణాళిక‌తో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ నిర్వహిస్తామని ఓట్ల లెక్కింపున‌కు సంబంధించిన అంశాలపై కౌంటింగ్ ఏజెంట్లు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న కలిగి ఉండాలని హి మాన్షు శుక్లా సూచిం చారు.చేయ్యేరు ఇంజనీరింగ్ క‌ళాశాల‌ల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో జూన్ 4న ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వు తుంద‌న్నారు. అధికారులు,సిబ్బంది,కౌంటింగ్ ఏజెంట్లు ఉద‌యం 6 గంట‌ల‌క‌ల్లా రిపోర్ట్ చేయాల‌ని సూచించారు.కౌంటింగ్ హాల్‌లో అధికా రులకు కౌంటింగ్ ఏజెంట్లు పూర్తిగా సహకరించి అత్యంత పార‌ద‌ర్శ‌కంగా,జ‌వాబుదారీతనం తో ఓట్ల లెక్కింపు జ‌రిపేందుకు తోడ్పాటు నoదించా లన్నారు.ఏజెంట్లు కౌంటింగ్ హాల్లో సత్ప్రవర్తన మెలగాలని,గోప్యతను క్రమశిక్షణను పాటించాలన్నారు.కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర బాధ్యతలు భాగస్వా మ్యంపై కనీస అవగాహన ఉండాల న్నారు.కౌంటింగ్ ఏజెంట్లను ఫారం 18 డిక్లరేషన్తో ఆర్ఓ నియమిస్తారన్నారు.ఏజెంట్లకు కనీస వయసు 18 సంవ త్సరాలు నిండి,భారతీయ పౌరుడై ఉండాలన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు,ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న వారు ఏజెంట్లుగా నియమించుటకు అనర్హులన్నారు.కౌంటింగ్ హాల్లో ఖచ్చితమైన క్రమ శిక్షణ పద్ధతి అమలు కావడంలో ప్రతి ఒక్కరు రిటర్నింగ్ అధికారికి సహకరించాలన్నారు.కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్ట్రానిక్ పరికరాలను సెల్ ఫోన్లు హాల్లోనికి తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.17 సి ఓట్ల అకౌంట్ నకలు ప్రతిని కౌంటింగ్ హాల్లోనికి తీసు కుని వెళ్లవచ్చునన్నారు.ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా పాటించాలన్నారు.కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సీట్లు ఏర్పాట్లు రాజకీయ కేంద్ర,రాష్ట్ర ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత క్రమంలో ఉంటాయ న్నారు.గోప్యతకు భంగం వాటిల్లే విధంగా కౌంటింగ్ ఏజెంట్లు వ్యవహరించరాదన్నారు. పోస్టల్ బ్యాలెట్ అనుమతి,తిరస్కరణ అంశాలపై కనీస అవగాహన ఉండాలన్నారు.కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయడం జరుగు తుందన్నారు.తొలుతగా పోస్టల్ బ్యాలెట్ తదుపరి 8:30 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభ మవుతుందన్నారు కౌంటింగ్ కేంద్రంలో కంట్రోల్ యూనిట్లు పేపర్ సీళ్ళు,ట్యాగులు,కౌంటింగ్ ఏజెంట్లు పరీక్షించు కోవాలన్నారు.పేపర్ సీళ్ళు ట్యాగ్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే లెక్కింపునకు అనుమతిస్తారన్నారన్నారు.కౌంటింగ్ ఏజెంట్లకు పేపరు పెన్సిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కంట్రోల్ యూనిట్ లో ఫలితాల బటన్ నొక్క గానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలైనది డిస్ప్లే అవుతుందని వాటిని ఏజెంట్లు నమోదు చేసు కోవాలని ఆయన సూచించారు. అభ్యర్థికి ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ కు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చునన్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన ఉండాలని రౌండ్ల వారీగా ఫలితాల నివేదికల పై సంతకాలు తప్పనిసరిగా చేయాలని సూచించారు.ఆర్ ఓ ఆదేశాలు అదే పనిగా అతిక్రమించే ఏజెంటును బయటకు పంపించే అధికారం ఆర్వో కు ఉందన్నారు కౌంటింగ్ కొనసాగుతున్న సమ యంలో కౌంటింగ్ హాలునుండి బయటకు వెళ్ళు టకు అనుమతిలేదని,తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే హాల్ బయటకు వెళ్లవలసిందిగా సూచించారు.

Related posts

అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం

AR TELUGU NEWS

మంత్రి దుర్గేష్ కు బండారు శ్రీనివాస్ అభినందనలు

AR TELUGU NEWS

పేదల బియ్యం అక్రమ రవాణా…. విజిలెన్స్ దాడులు… 480 బస్తాలు సీజ్…

AR TELUGU NEWS