ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
డిఎంహెచ్వో డి. మహేశ్వరరావు..
భీమవరం మే 31:పొగాకు వాడకం ద్వారా వచ్చే అనర్ధాలకు తెలుసుకుని, ధూమపానానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డిఎంహెచ్వో డి మహేశ్వరరావుఅన్నారు, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఏరియా హాస్పిటల్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎవరైనా ధూమపానం చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, అలాగే పొగాకు వల్ల వచ్చే అనర్ధాలు ధూమపానం చేసే ప్రతి వ్యక్తి తెలుసుకుని జీవించాలన్నారు, ఈ అవగాహన ర్యాలీలు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించమన్నారు, ఎవరైనా ధూమపానానికి అలవాటై ఆరోగ్యం పాడు చేసుకోక ముందే తగిన చికిత్స తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు చెరుకువాడ రంగ సాయి,
అదనపు జిల్లా వైద్య అధికారి డా.భాను నాయక్
డా. ధనలక్షిమి పి.ఓ – ఎన్.సి.డి, డా. సూర్య నారాయణ, డా. మాధవి కళ్యాణి, డా గోవింద్ బాబు , ఏ ఎన్ ఎంలు , ఆశలు ఇంకా ఇతర హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు …