ఘనంగా రాయి సతీష్ జన్మదిన వేడుకలు
ఉండి: మే 30 :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాయి సతీష్ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో సీనియర్ పార్టీ నాయకులు గుండాబత్తుల సుబ్బారావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాబత్తుల సుబ్బారావు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు మాట్లాడుతూ పార్టీ పట్ల రాయి సతీష్ అంకితభావంతో పనిచేయడం వల్ల పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. సతీష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం రాయి సతీష్ మాట్లాడుతూ తన రాజకీయ గురువు పాతపాటి సర్రాజు యువకుడైన తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన స్ఫూర్తితో పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తానన్నారు. అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సురవరపు వెంకటాచార్యులు, నాయకులు అంగర రాంబాబు, పాటూరి దొరబాబు, వర్రే ముసలయ్య, శేషాద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపారు.