బైండోవర్ కేసులు ఉన్నవారిని ఏజెంట్లుగా నియమించరాదు – ఎన్నికల రిటర్నింగ్ అధికారిని స్వామి నాయుడు
ఎన్నికల కోడ్ అమలు, బాణా సంచకాల్చడం నిషేధం
ఆచంట మే 30 :సార్వత్రిక ఎన్నికలు 2024 కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి నియోజకవర్గ ఎన్నికల అధికారి వి .స్వామి నాయుడు స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో భీమవరం బి సీత పాలిటెక్నిక్ కళాశాల 2వ అంతస్తులో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, అవిఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్, ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకుడు, మైక్రో అబ్జర్వర్ ను నియమిస్తున్నామని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 4 టేబుల్స్ ఏర్పాటు చేసామని, ప్రతి టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులకు ఒక సహాయకుడు, ఇద్దరు మైక్రో అబ్జర్వ్ నియమిస్తున్నామని అన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బందిని 3 దళల్లో సాంకేతిక విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామని అన్నారు. కౌంటింగ్ టేబుల్ సంఖ్య అనుగుణంగానే ఏజెంట్లను అనుమతిస్తామని, వారికి ఫారం 18, గుర్తింపు కార్డులు జారీ చేస్తామని అన్నారు. నేర చరిత్ర కలిగిన వారిని, టైండోవర్ కేసులు నమోదైన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించకుండా అభ్యర్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని అన్నాడు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్స్ సీరియల్ నెంటర్ వారీగా కూర్చోవాలని, అభ్యర్థి, ఆయన ఏజెంట్లలో ఎవరో ఒకరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్దకు అనుమతిస్తామని, తొలుత పోస్టల్ బ్యాలెట్, అరగంట తరువాత ఈవీఎం ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. రౌండ్ల ల వారి ఫలితాలు ఏజెంట్లకు ఇస్తామని, వాటిని ఫామ్ 17 సి తో నిర్ధారించుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే 5 ఈవీఎంలకు చెందిన వి వి ప్యాట్ లోని ఓట్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లెక్కిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర మొబైల్ కలెక్షన్ పాయింట్, పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. వచ్చేనెల 6 వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, బాణసంచా కాల్ చేయడం మాత్రం లేదని తెలియజేశారు.