లైబ్రెరీలో మానవ శరీర నిర్మాణం, నాడీ మండల వ్యవస్థపై అవగాహన
నర్సాపురం మే 30 :నర్సాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు సందర్భంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల చేత తెనాలి రామకృష్ణ కథలు, చందమామ ,బాలమిత్ర కథలు అక్బర్ బీర్బల్, పంచతంత్ర, తాతయ్య చెప్పిన కథలు, మర్యాద రామన్న కథలు చదివించడం జరిగింది. బార్క్ సీనియర్ శాస్త్రవేత్త రంగినేడి సుబ్బారావు పిల్లలకు మానవ శరీర నిర్మాణం నాడీ మండల వ్యవస్థ గురించి , ఆరోగ్యంగా ఉండడం అన్నది అంతరిక్ష యానం నుంచి సాధారణ జీవితం వరకు అవసరమని వివరించడం జరిగింది. పల్స్ రేట్ ,రెస్పిరేషన్ రేట్, మెజర్మెంట్ చేయడం పిల్లల నేర్పించడం జరిగింది అంతేకాకుండా లైఫ్ స్కిల్స్ ఆవశ్యకతను తెలియజేసే కథను చక్కగా వివరించి చెప్పడం జరిగింది .ఆర్టిస్ట్ తోట శ్రీనివాస్ పిల్లలకు నెమలి బొమ్మలు వేయడం నేర్పించినారు .రిసోర్స్ పర్సన్ తమరపు కృష్ణ పిల్లల చేత ధ్యానం చేయించడం, కరాటే ప్రాక్టీస్ చేయించారు. తదనంతరం పిల్లలకు క్యారమ్స్ మెమరీ గేమ్స్ ఆడించడం జరిగింది. ఈ శిక్షణ తరగతులు గ్రేడ్ వన్ లైబ్రరీయన్ కె జె ఎస్ ఎల్ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.