ఘనంగా మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు
భీమవరం మే 30:భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పుట్టినరోజు వేడుకలను పట్టణ జనసేన టిడిపి నాయకులు ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపి బిసి సాధికారిత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు, తెలుగు యువత నాయకుల మద్దుల రాము ఆధ్వర్యంలో మాజీ అంజిబాబుకు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలకు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పట్టణ అభివృద్ధికి అంజిబాబు చేసిన సేవలు ఎనలేనివని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకావాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కుమారుడు పులపర్తి ప్రశాంత్, మద్దుల, గంటా త్రిమూర్తులు, యలమంచిలి శ్రీనివాసరావు, తిప్పా బాల ముత్యం, విన్నకోట వినాయక్, భీమాల శ్రీరామూర్తి, లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, మంతెన కనకదుర్గ ప్రసాద్ రాజు, పొత్తూరి బాపిరాజు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.