తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం నందు ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు
తాడేపల్లిగూడెం మే 28 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతినీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం జనసేన నాయకులతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండదంతో జనసేన పార్టీ అధిష్ఠానం
మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని జనసేన కార్యలయల నందు జరపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చరని, ఆ మహనీయున్ని స్మరించుకుంటూ సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అలానే ఆయన ప్రవేశపెట్టిన పధకాలే ఆదర్శమై ఇప్పటికి సంక్షేమ పధకాలుగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశి, రామశేట్టి సురేష్, పైబోయిన రఘు, గట్టిమ్ నాని, దాగరపు నాగు, పిడుగు రామ్మోహన్రావు బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.