ఎన్టీఆర్ కు భారతరత్న తోనే ఘన నివాళి.
కాకినాడ, మే 28 : తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినపుడే ఘనమైన నివాళి అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు.ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు
నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపాక సుబ్బు మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి జిల్లా బిజెపి నాయకుడు వనము శెట్టి సుబ్బారావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ మండపాక వీర వెంకట సత్యనారాయణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజ్ రెండు సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా పులి పద్మ కుమారి తనయుడు డానియల్ మనోహర్ జన్మదిన వేడుకలలో భాగంగా పేదలకు భోజన వసతి కల్పించారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ అందించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు.త్వరలో నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఉప్పు మురళీకృష్ణ, అన్నపరెడ్డి గంగాధరం మండపాక నాగబాబు, ఏలూరు బాజీ, కర్రి వీరబాబు అడపా జగదీష్ ఖాసిం లకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, టిడిపి కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

previous post