నూలి సాయి అభయ్ ఇంటర్నేషనల్ చెస్ పోటీలు ప్రారంభం
నర్సాపురం మే 28 :నర్సాపురం స్థానిక అల్లూరి మెమోరియల్ స్మారక కళ్యాణ మండపంలో నూలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన కుమారుడు నూలి సాయి అభయ్ జ్ఞాపకార్థం ఇంటర్నేషనల్ స్థాయిలో చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాల నుండి సుమారు 524 మంది పోటీలు లో బాల బాలికలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు వి సత్యనారాయణ రావు చీఫ్ ఆర్పొరేటర్ గోపీనాథ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి చెస్ అకాడమీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో నూలి శ్రీనివాస్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బాబు శ్రీ, బుడితి అనిల్,మేడిది రాము మరియూ తదితరులు పాల్గొన్నారు.