సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటోంది – ఆర్ వో వి స్వామి నాయుడు.
ఆచంట మే 28: సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు కు సంబంధించి స్థానిక రామేశ్వర స్వామి సత్రంలో సోమవారం నాడు నియోజవర్గ పరిధిలోని కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించామని ఆర్వో వి స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ ఓ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సీసీటీవీ కెమెరాల పరిరక్షణలో కొనసాగుతుందని అన్నారు. కౌంటింగ్ కు సంబంధించి సూపర్వైజర్లు అసిస్టెంట్లు మైక్రోఅబ్సర్వర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది జూన్ 4న ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి విధిగా హాజరు కావాలని తెలిపారు. కంట్రోల్ యూనిట్ లో ఫలితాలు ఎలా చూపించాలనేది ప్రత్యక్షంగా కంట్రోల్యూనిట్ పై చూపించడం జరిగిందన్నారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని వివరాలు లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది లిఖిస్తారని ఈ ప్రక్రియ వీడియో తీసి భద్రపరుస్తామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆచంట తాసిల్దార్ ఐ వి శెట్టి పెనుగొండ తహసీల్దార్ రోహిణి దేవి పెనుమంట్ర తహసిల్దార్ కే లక్ష్మీ కళ్యాణి పెనుగొండ ఎంపీడీవో ఎస్ శ్రీనివాస్ దొర పెనుమంట్ర ఎంపీడీవో పి పద్మజ పోడూరు ఎంపీడీవో డి సుహాసిని డిప్యూటీ తహసీల్దార్ ఎం రాంప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.