ఆకలితో ఉన్నవారికీ కడుపునిండా భోజనం అందిద్దాం
* ఆకలి-రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్
* భీమవరంలో 250 మందికి ఉచిత ఆహార పొట్లాలు అందజేత
భీమవరం మే 28 :మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తూ ఉంటారని, అటువంటి వారికీ కడుపునిండా భోజనం అందిద్దామని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ యిర్రింకి సూర్యారావు అన్నారు. ‘వరల్డ్ హంగర్ డే’ సందర్బంగా ఆకలి-రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా భీమవరంలో 250 మందికి ఉచిత ఆహార పొట్లాలు అందించే కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు 365 రోజులపాటు నిరు పేదలకు భోజనాన్ని హంగర్ ఫ్రీ వరల్డ్ అంటూ మలబార్ గోల్డ్ చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. భీమవరం షోరూం హెడ్ ఇంథియాస్ మాట్లాడుతూ 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో మలబార్ గోల్డ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని, పెంచుతూ 51,000 పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రోజుకు కనీసం కడుపునిండా ఒకసారి భోజనం చేయడానికి ఏంతో కష్టపడుతున్నారని, అటువంటి వారికీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎన్జిఓ ‘థనల్ – దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ సహాయంతో ‘హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్’ అమలు చేస్తున్నామని, మలబార్ గ్రూప్, థనల్ వాలంటీర్లు వీధులు, పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేదలను గుర్తించి ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందిస్తారని అన్నారు. వీధి బాలల ప్రాథమిక విద్య కోసం గ్రూప్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించిందని, మలబార్ గ్రూప్ ఇతర సాంఘిక సంక్షేమం, వైద్య సంరక్షణ, విద్యార్థినులకు విద్య పేదల ఇళ్ల నిర్మాణానికి పాక్షికంగా మద్దతు అందించడం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో సైతం చురుకుగా పాల్గొంటుందన్నారు. ఇటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే రూ 246 కోట్లను మలబార్ గ్రూప్ ఖర్చు చేసిందని అన్నారు. అనంతరం లెప్రసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ పలు ఆశ్రమంలోని వృద్దులకు ఆహార ప్యాకెట్లను అందించారు. కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రజి, అల్లు శ్రీనివాస్, నరసింహ, కృష్ణ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.