ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఫర్ ఇండియా పరామర్శ
తణుకు మే 28 :ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తణుకు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఫర్ ఇండియా చిన్నపాటి శ్రీకాంత్, నందం నరసింహారావు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా
ప్రెసిడెంట్ ఝాన్సీ లారెన్స్ భాదితురాలు ఇంటికి
వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి తన ఇంటి సమీపంలో ఉంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తిమోతీ ను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తండ్రి ఇటీవల మరణించినట్లు చెప్పారు. ఈ లోగా ఈ ఘటన జరగడం తో
బాధిత కుటుంబ సభ్యులు చాలా తీవ్ర మనస్తాపం చెందారు. బాలిక తల్లి చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని కుటుంబ పోషణ చేస్తుంది.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పిల్లలకు స్కూల్ బుక్స్ ఇస్తామని హ్యూమన్ రైట్స్ కౌన్సెలింగ్ ఫర్ ఇండియా పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఝాన్సీ లారెన్స్ చెప్పి రావడం జరిగింది అని చెప్పారు. ఈ ఘటనకు సంభందించి కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.