ప్రజా దాహార్తి కోసం చల్లని మజ్జిగా, నీరు పంపిణీ చేసిన తణుకు దిశా టీమ్
తణుకు మే 27 : దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తణుకు టౌన్ ప్రెసిడెంట్ కొలగాని కృష్ణవేణి ఆధ్వర్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలకు దాహార్తి తీర్చుటకు చల్లటి మజ్జిగా, చల్లటి నీరు పంపిణీ చేయడం జరిగింది అని కృష్ణ వేణి తెలిపారు. ఈ కార్యక్రమంను నిర్వహించిన దిశ టీం ను బి. సాయి కిరణ్ శర్మ, బి.లక్ష్మీ
నాగరాజు మరియు సంభందిత పెద్దలు, తదితరులు అభినందించి
ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిశ కుటుంబ సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
పద్మ, నరస సరోజినీ, దుర్గ, రాధ, కృప,సత్యవతి, రవణమ్మ , ఎస్ నరసమ్మ , సుధా, టి సత్యవతి , తదితరులు సహకరించి దాహార్తి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బి వి రాజు, కల్యాణి తణుకు దిశా టీమ్ కుటుంబ సభ్యుల సేవలు ఎంతో అభినందనీయం అని కొనియాడారు.