పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్తత
పెంటపాడు మండలం రావిపాడులో సైనికో ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ దళిత వర్గాల చర్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన సైనిక్ ఉద్యోగి భార్య విజయలక్ష్మిని కిందపడేసి దాడి చేశారు. రావిపాడు కు చెందిన పలివెల నాగేష్ తాను ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగ్రామంలో ఉండేందుకు ప్రభుత్వానికి స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు. దీంతో గ్రామంలోని మూడు సెంట్లు స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కేటాయించారు. దీన్ని అడ్డుకునేందుకు స్థానికంగా ఉన్న వైసీపీకి చెందిన రాజకీయ నేత ఆ స్థలంలో నిర్మాణం చేపట్టకూడదని ఎస్సీ వర్గీలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అయినా సైనికో ఉద్యోగి నాగేష్ తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని తనకు గ్రామ రాజకీయాలతో సంబంధం లేదని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో అధికారులు నగేష్ కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. కానీ గ్రామంలోని ఆ వైసిపి నేత ప్రోత్సాహంతో ఎస్సీ వర్గీయులు నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అంబేద్కర్ బొమ్మ ఏర్పాటుకు యట్నించారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన సైనిక్ ఉద్యోగి భార్య విజయలక్ష్మిని ఎస్సీ వర్గీయులు కిందపడేసి దాడి చేశారు. ఈ ఘటన జరిగే ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే మరో అంబేద్కర్ విగ్రహం కమ్యూనిటీ హాల్ ఉండటం గ్రామంలో రాజకీయ కుట్టిలతకు అర్థం పడుతుంది. తమకు న్యాయం చేయాలని సైనికో ఉద్యోగి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

previous post