రహదారి పైనే డంపింగ్ యార్డులు ప్రయాణికుల అవస్థలు
ఆచంట మే 27:. మండలంలోని గ్రామాల్లో సేకరించిన చెత్తను మార్టేరు- కోడేరు ప్రధాన రహదారులు నక్కల కాలువ వద్దకు తరలించడంతో ప్రధాన రహదారి డంపింగ్ యార్డ్ ను తలపిస్తుంది చెత్త వ్యర్ధాలను రోడ్లకు ఇరువైపులా పడవేయడంతో ఒక ప్రక్క పందులు, కుక్కలు చల్లాచెదరు చేస్తున్నాయి మరోపక్క వర్షాలు కురిస్తే చెత్తా చెదారం రోడ్డు పైకి చేరడంతో ప్రయాణికులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ కార్మికులు నిత్యం టన్నులకొద్ది సేకరించిన చెత్తను రోడ్ల పక్కన వేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. అంతేగాక ఇటీవల కాలంలో ప్రధాన రహదారిపైనే చెత్త పేరు కు పోవడం వల్ల ద్విచక్ర వాహనదారులకు రోడ్ల ప్రమాదాలు జరిగిన సంఘటన లు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

previous post