అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం
భీమవరం మే 27:ఈరోజు అల్లూరి సీతారామరాజు బగత్‌సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో మెంటేవారితోటలోని సుందరయ్య భవనంలో బి.పి, షుగరు, ఫిట్సు, పెరాలసిస్ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్‌కి పరిసర ప్రాంతాల రోగులు సుమారు 200మంది ఉపయోగించుకుటన్నట్లు అల్లూరిసీతరామరాజు భగత్‌సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్టు ఛైర్మన్ బి.బలరాం తెలిపారు. ఈ క్యాంప్‌లో 3నెలలకు సరిపడా మందులను కేవలం రూ.300లకే అందజేశామన్నారు.క్రమం తప్పకుండా ప్రతి మూడునెలలకు నిర్వహించే ఈ క్యాంప్‌ని అందరూ వినియోగించుకోవలన్నారు.
వసుధఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాదరాజుగారు ఈ క్యాంప్‌కి వచ్చి రోగులకు సేవలందించిన డాక్టర్లకు పుష్పగుచ్చములచ్చి అభినందించారు. ఈ క్యాంప్‌కు ప్రముఖ న్యూరాలజి డా॥ గోపాళం శివన్నారయణగారు, జనరల్ ఎండి జి.పద్మగారు, సందీప్‌వర్మగారు, పి.సత్యనారాయణరాజు ఎంబిబిఎస్‌లు మానవతా, సేవాదృక్పదంతో ఆహ్వానించగానే ఈ క్యాంప్‌లో పాల్గొని తమ వంతుగా సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ది: 28.5.2024న మంగళవారం మెంటేవారితోట సుందరయ్య భవనంలో జరిగే ఉచిత చిన్నపిల్లల గుండె మెడికల్ క్యాంప్‌ను వినియోగించుకోవాల్సిందిగా శ్రీ ఇందుకూరి ప్రసాదరాజరు తెలిపారు.