లైబ్రెరీలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ & కమ్యూనికేషన్లో శిక్షణ
నర్సాపురం మే 25 : నర్సాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంధాలయం నందు వేసవి విజ్ఞాన తరగతులలో భాగంగా శనివారం పిల్లల చేత పుస్తక పఠనం ,పత్రిక పఠనము చేయించడం, ఎలుక-కొత్తపులి మరియు నలుగురు స్నేహితులు కథలు వినిపించడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాడి ప్రిన్స్ ప్రవీణ్ చే గుడ్ కెరీర్, స్కిల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వివరించారు. శ్రీనివాస్ తెలుగు క్లాసులలో యోగ ,మెడిటేషన్ సాధన చేయించడం మరియు కరాటేలో లోయర్ పంచ్, మిడిల్ పంచ్, అప్పర్ పంచ్ లో తామరపు కృష్ణ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తరగతులలో సూర్యం బాబు, సాఫ్ట్ లైన్ ఎం సుధీర్ మోహన్, సురేష్ మరియు పిల్లలు తల్లిదండ్రు లు విద్యార్థులు పాల్గొన్నారు అని గ్రేడ్ వన్ లైబ్రరియన్ కె జె ఎస్ ఎల్ కుమారి తెలిపారు.