పిల్లల ను రక్షించుకునేందుకు రక్షణ చట్టం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి – సివిల్ జడ్జి జి. గంగ రాజు
నర్సాపురం మే 25 : శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా నర్సాపురం మండల న్యాయ సేవాధికారా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బార్ అసోియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు అధ్యక్షతన డ్వాక్రా మహిళలకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జి. గంగ రాజు పాల్గొని మాట్లాడారు. 1983 లో ప్రారంభమైన అంతర్జాతీయ తప్పిపోయిన బాలల ప్రత్యేక దినాన్ని ప్రతి సంవత్సరం మే 25న జరుపుకోవడం వలన సమాజంలో అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలను చైతన్యవంతులుగా చేయడం జరువుతుంది అని అన్నారు. ప్రతి సంవత్సారం దాదాపు 96 వేల పిల్లలు అపహరణకు గురవుతున్నారని, అందుకే పిల్లల ను రక్షించడానికి రక్షణ చట్టం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉన్నత న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి పెట్టింది. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో , స్కూల్ లో వారి ప్రవర్తన ఎలా ఉందో తరచూ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియా కు ప్రభావితులై తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతున్నారు. బాలికలను అపహరించి, అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. చిన్నతనం నుండి పిల్లలకు మంచి, చెడు నేర్పించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కుటుంబ భంధవ్యాలపై భాధ్యత ఉంటుంది. ఒంటరిగా ఎవరైనా పిల్లలు అనుమానాస్పదంగా కనిపిస్తే 1098 కి కాల్ చేస్తే శిశు గృహ డిపార్ట్మెంట్ వారు వారికి వసతి కల్పిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, చల్లా దానయ్య నాయుడు, జనరల్ సెక్రెటరీ ఆర్. జి. కుమార్, చిట్టి పద్మజ, కార్యవర్గ సభ్యులు, ప్యానల్ లాయర్ లు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.