ఉప కారాగారాన్ని తనిఖీ చేసిన అధనపు సివిల్ జడ్జీ కె. శ్రీనివాసరావు
నర్సాపురం మే 25 : నర్సాపురం అధనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె . శ్రీనివాసరావు స్థానిక ఉప కారాగారాన్ని శనివారం తనిఖీ చేశారు. ముందుగా వంటశాల ను , ఆహార పదార్థాలను, జైల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్ ల పై అవగాహన కల్పించారు. బెయిల్ పై బయటకు వెళ్లిన వారు కేసు పూర్తి అయ్యేవరకు ప్రతీ వాయిదాకు హాజరు కావాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం ప్యానల్ న్యాయవాదులను ఉపయోగించుకోవాలన్నారు
జైల్ విజిటింగ్ లాయర్ శిరీష, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చాముండేశ్వరి, పి.ఎల్.వి వరలక్ష్మి, ఉప కారాగారం పర్యవేక్షణ అధికారి టి. అప్పారావు, జైల్ సిబ్బంది పాల్గొన్నారు.