ఘనంగా నందమూరి చైతన్య కృష్ణ జన్మదిన వేడుకలు.
కాకినాడ మే 24 : ఎన్టీఆర్ వారసుడు నందమూరి చైతన్య కృష్ణ జన్మదిన వేడుకలు
నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాంవర్మ, ఏలూరు జిల్లా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పు మురళీకృష్ణ, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, మండపాక సాయిరాం ఏర్పర్చిన భోజనాలను అన్నా ఎన్టీఆర్ జనార్దన్ కేరేజ్ ద్వారా 727వ రోజు పేదలకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కాసిం, మండపాక వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

previous post