ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని కౌలు రైతుల సంఘం డిమాండ్
భీమవరం మే 24 :రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం భీమవరం లోని ఉపాద్యాయ కార్యలయంలో కేతా గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు వ్యవసాయం చేసేదంతా కౌలురైతులేనన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆసరా లేకపోయినా అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పలుతెచ్చి పంటలు పండిస్తున్నరన్నారు. ప్రభుత్వం నెలలు తరబడి డబ్బులు వేయకపోతే కౌలురైతుల కష్టొర్జితం అంతా అప్పుల వడ్డీలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం డబ్బలు విడుదల చేయడంతో పాటు పంట కాలువలు, మురుగు కాలువల ఆదునీకరణకు నిదులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈసమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు, సభ్యులు పి.నర్శింహమూర్తి, సిహెచ్ శ్రీనివాసు, కె.శ్రీనివాస్, ఎ.సత్యనారాయణ, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.