స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతా చర్యలను పరిశీలన
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
భీమవరం: మే 23: భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కల్పించిన భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం పరిశీలించారు. రోజువారీ తనిఖీలో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ కు వేసిన తాళాలను, సీళ్లను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు అనువైన హాల్స్ ను పరిశీలించారు. లెక్కింపుకు అనువుగా వున్న టేబుల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
తొలుత ఓట్ల లెక్కింపు రోజున మీడియాకు ఫలితాల వివరాలను అందించేందుకు గాను మీడియా సెంటర్ ఏర్పాటు చేయనున్న క్రమంలో సంబంధిత భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, డిపిఆర్ఓ టి.నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.