ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్ కుటుంబం సభ్యులకు రక్షణ కల్పించండి – అంబేద్కర్ ఆలోచన వేదిక
తణుకు మే 23 : తణుకు లో అంబులెన్స్ ఓనర్ కప్పల రాజ్ కమల్ (మాల) ను వేదిస్తూ చెప్పుతో కొట్టిన యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ,అతని కుమారుడు విజయ్ పై చర్యలు తీసుకోవాలని అలాగే తణుకు ప్రైవేట్ అంబులెన్స్ లు అన్నీ టికీ ఒకే సీరియల్ విధానం పాటించాలి అని మూడు నెలలు గా ఆర్దీకంగా నష్టపోయిన రాజ్ కమల్ కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో తణుకు లో రాజ్ కమల్ కుటుంబం తో పాటు నేను కూడా ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు పోలీసులను హెచ్చరించారు. తణుకు హోసింగ్ బోర్డు కాలనీలోని డాక్టర్. అంబేద్కర్ భవనం నందు బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఎర్పాటు చేసారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తణుకు, నరసాపురం పోలీసులు, ప్రైవేట్ అంబులెన్సు యూనియన్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవ్వాకుల. భరత్ కుమార్ డిమాండ్ చేసారు. లేని పక్షంలో తణుకు నడిబొడ్డున బాధితులకుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండే. నాగేశ్వరావు, కప్పల. రాజు, పావని, వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గున్నారు.