March 12, 2025
Artelugunews.in | Telugu News App
తెలంగాణ

అనంత్ అంబానీ పెళ్లి కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేక బహుమతులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లు చాలా రిచ్ గా ఉంటాయి.. వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు.. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు అని అనేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం పెళ్లంటే ఇలా చేయాలి.. పెళ్లి వేడుక అంటే ఇలా ఉండాలి.. ఎంత బాగా చేశారురా అని అనిపించుకోవాలి. అనంత్ అంబానీ పెళ్లి వేడుక కూడా అలానే జరుగుతుంది. ఇప్పటికే భారతీయ సంప్రదాయం ప్రకారం సొంత ఊరిలో ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించి శభాష్ అనిపించుకున్న అంబానీ కుటుంబం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పెళ్లి వేడుకకు వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అత్యంత విలాసవంతమైన వస్తువులను బహుమతులుగా అందించనున్నారు. ఆ వస్తువులు మన కరీంనగర్ నుంచే వెళ్తుండడం విశేషం.

జూలైలో వివాహ వేడుక:

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జూలై నెలలో జరగనున్న విషయం తెలిసిందే. భారీ క్రూయిజ్ షిప్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే రెండు దేశాల్లో వీరి పెళ్లి వేడుక జరపాలని ముకేశ్ అంబానీ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే మే 29న ఇటలీలో పెళ్లి వేడుక మొదలై జూన్ 1న స్విట్జర్లాండ్ లో ముగుస్తుంది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్ వరకూ 800 కి.మీ. ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. కాగా ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, బాలీవుడ్ కి చెందిన బడా స్టార్స్ సహా మొత్తం 300 మంది వీవీఐపీలు పాల్గొనబోతున్నట్లు సమాచారం.

అతిథుల కోసం కరీంనగర్ బహుమతులు:

అయితే తన పెళ్లి వేడుకకు వచ్చే అతిథుల కోసం విలువైన బహుమతులను అందించేందుకు అంబానీ ప్లాన్ చేశారు. ఆ బహుమతుల్లో కరీంనగర్ నుంచి తయారయ్యే వస్తువులు ఉండడం విశేషం. వెండి ఫిలిగ్రీ కళాఖండాల తయారీలో కరీంనగర్ ప్రఖ్యాతి గడించింది. విలాసవంతమైన వెండి కళాఖండాలను తయారు చేసే ప్రాంతంగా కరీంనగర్ పేరొందింది. అంబానీ పెళ్లి వేడుకకు వచ్చే వీవీఐపీలకు బహుమతులు అందించడం కోసం అంబానీ కుటుంబం.. 400 రకాల వస్తువులను ఆర్డర్ చేసింది. అత్యంత విలువైన ఫిలిగ్రీ బహుమతుల డెలివరీ కోసం 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చాయని కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎర్రోజు అశోక్ తెలిపారు. ఈ 400 రకాల వస్తువుల్లో నగల పెట్టెలు, ట్రేలు, పండ్ల గిన్నెలు, పర్సులు వంటి అనేక వస్తువులు ఉన్నాయని వెల్లడించారు.

అందుకే కరీంనగర్ బహుమతులు, 400 ఏళ్ల నాటి చరిత్ర – 150 కుటుంబాలకు జీవనాధారం:

కాగా కరీంనగర్ కళాకారులు సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో సిద్ధహస్తులు. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. పలు ఆకారాల్లో వస్తువులను తయారు చేయడం, తీగలు అల్లడం వంటివి హస్తకళాకారులు చేస్తారు. 400 ఏళ్ళ నాటి పురాతన కళ ఇది. అలాంటి కళకు అంబానీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని ఎర్రోజు అశోక్ తెలిపారు. తరతరాలుగా ఈ పురాతన హస్తకళపై ఆధారపడి కరీంనగర్ లో దాదాపు 150 కుటుంబాలు జీవిస్తున్నాయని ఆయన అన్నారు. 2007లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది.

 

 

Related posts

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

AR TELUGU NEWS

గోదావరి స్థానానికి వెళ్లే వారికి హెచ్చరికలు జారీ

AR TELUGU NEWS

Nicki Minaj: డ్రగ్ కేసులో సింగర్ అరెస్ట్.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

AR TELUGU NEWS