డిప్యూటీ సీఎం కొట్టు ను కలిసిన నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల.
తాడేపల్లిగూడెం,మే 22: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరి ఉమాబాల బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను కలవడంలో భాగంగా ఆమె తాడేపల్లిగూడెం వచ్చి కొట్టును కలిశారు. పోలింగ్ సరళి, ఓటింగ్ తీరు తదితర అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఓటర్లు సానుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వీరు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంటరీ నియోజవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పై చర్చించారు.