- పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
- ధర్భగూడెం గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ
- సచివాలయం సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని సూచన
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ధర్భగూడెం గ్రామ సచివాలయాన్ని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. సచివాలయం పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలపై సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని మురుగు నీటి డ్రైన్స్ శుభ్రపర్చాలని, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ నిర్వహించి మలతీయాన్, అబేట్ తదితర క్రిమి సంహారిక మందులను పిచికారీ చేసి దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు. సిబ్బంది హాజరు తనిఖీ చేసి సచివాలయం సిబ్బంది ఏకరూపు దుస్తులు విధిగా ధరించాలన్నారు. అనంతరం లక్ష్మీపురం గ్రామంలో వెళ్లి ఓవర్ హెడ్ త్రాగునీరు ట్యాంక్ పైకెక్కి పరిశీలించి ప్రతి పదిహేను రోజులకొకసారి విధిగా క్లోరినేషన్ చెయ్యాలని సిబ్బందికి సూచించారు. దోమల నివారణకు అన్ని గ్రామాలలో ఫాగ్గింగ్ జరగాలని అన్నారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతే ప్రజలు వ్యాధుల బారిన పడరని అలాగే ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి నిఖిల్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సువర్ణ కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఆడమ్ తదితరులు పాల్గొన్నారు.