పశ్చిమగోదావరి జిల్లా తేతలి గ్రామంలో బై రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు, ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన, వేదిక్ మ్యాథ్స్, ఫోల్డ్స్కోప్ వినియోగం,స్క్రిప్ట్ రైటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ గేమ్స్,రోల్ ప్లే మరియు గేమ్స్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు, పదవ తరగతి నుండి ఆపైన చదువుకున్న నిరుద్యోగ యువతకు రెస్యూమ్ బిల్డింగ్, ఆన్లైన్లో జాబ్ సెర్చింగ్ మరియు అప్లై చేయడం ఇంటర్వ్యూ స్కిల్స్ పెంపొందించడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు, శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బైర్రాజు ఫౌండేషన్ కమ్యూనిటీ సభ్యుడు ఎన్ సుబ్బరాజు సర్టిఫికెట్లు అందించారు, ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, బైర్రాజు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
